Saturday, November 24, 2012

.:: ఆగస్టు 2012 క్రీడలు ::.

క్రీడా అవార్డులు
ద్రోణాచార్య అవార్డులు: క్రీడా రంగంలో కోచ్‌లకు ఇచ్చే ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డుకు 2012 సంవత్సరానికి ఆరుగురు కోచ్‌లు ఎంపికయ్యారు. అస్లాం షేర్‌ఖాన్ నేతృత్వంలోని కమిటీ వీరిని ఎంపిక చేసింది. వివరాలు.. యశ్వీర్ సింగ్ (రెజ్లింగ్); వీరేంద్ర పూనియా (అథ్లెటిక్స్); సునీల్ దేవాస్(కబడ్డీ); హరీందర్ సింగ్ (హాకీ); సత్యపాల్ (పారా అథ్లెటిక్స్); ఫెర్నాండెజ్ (క్యూబా,బాక్సింగ్); విదేశీ కోచ్‌కు ఈ అవార్డు దక్కడం ఇదే ప్రథమం

ధ్యాన్‌చంద్ అవార్డులు: ఈ అవార్డులు నలుగురు మాజీ క్రీడాకారులకు దక్కాయి. వివరాలు.. జగ్ రాజ్‌సింగ్ మాన్(అథ్లెటిక్స్); గుణ్ దీప్ కుమార్ (హాకీ); వినోద్ కుమార్(రెజ్లింగ్); సుఖ్‌బీర్ సింగ్ టోకాస్ (పారా స్పోర్ట్స్)

లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు: జె.ఎస్. భాటియా (అథ్లెటిక్స్), భవానీ ముఖర్జీ (టేబుల్ టెన్నిస్) ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: క్రీడలను ప్రోత్సహించినందుకుగాను ఇచ్చే ఈ అవార్డు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్, సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, ఎయిర్ ఇండియా స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు దక్కింది.

భారత్‌కు అండర్ -19 ప్రపంచకప్
అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. టౌన్స్‌విల్లే(ఆస్ట్రేలియా)లో ఆగస్టు 26న జరిగిన ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ టోర్నమెంట్‌ను భారత్ మూడోసారి గెలుచుకుంది (2000, 2008లలో కూడా విజేతగా నిలిచింది). భారత జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా, ఆస్ట్రేలియా కెప్టెన్ బసిస్టో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' గా ఎంపికయ్యారు.

లాన్‌‌సపై జీవితకాల నిషేధం
ప్రఖ్యాత సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్‌పై అమెరికా యాంటీ డోపింగ్ ఏజెన్సీ(యూఎన్‌ఏడీఏ) జీవిత కాల నిషేధం విధించింది. దీంతో 1998 నుంచి ఇప్ప టి వరకు సాధించిన అన్ని విజయాలు రద్దవుతాయి.

యూఎన్‌ఏడీఏ తనపై చేస్తున్న ఆరోపణలపై పోరాడకూడదని ఆర్మ్‌స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడంతో నిషేధం అనివార్యమైంది. 1996లో వృషణాల క్యాన్స ర్ బారిన పడ్డాడు. బతకడం అసాధ్యమనుకున్న దశ నుంచి పలు శస్త్ర చికిత్సలతో కోలుకున్నాడు. తిరిగి సైక్లింగ్ సాధన ఆరంభించి.. 1999 నుంచి 2005 వరకు వరుసగా ఏడు టూర్‌డి ఫ్రాన్‌‌స టైటిళ్లు గెలుచుకున్నాడు. ఈ విజయంతో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగులందరిలో ధైర్యాన్ని నింపాడు.
 
అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన లక్ష్మణ్ 
హైదరాబాద్‌కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు వీవీఎస్ లక్ష్మణ్ (37) అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆగస్టు 19న ప్రకటించాడు. 1996లో టెస్ట్ కెరీర్ ప్రారంభించిన లక్ష్మణ్ 1998లో వన్డేలలో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 134 టెస్ట్ట్‌లు ఆడి 17 సెంచరీలతో 8781 పరుగులు, 81 వన్డేల్లో ఆరు సెంచరీలతో 2338 పరుగులు చేశాడు. 2001లో కోల్‌కతా టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై సాధించిన 281 పరుగులు.. భారత బ్యాట్స్‌మెన్ టెస్టుల్లో చేసిన మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్. లక్ష్మణ్‌కు 2001లో అర్జున, 2011లో పద్మశ్రీ అవార్డులు లభించాయి. 2002లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు.

2012 క్రీడా బహుమతులు
2012 సంవత్సరానికి రాజీవ్ ఖేల్త్న్ర, అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 19న ప్రకటించింది. ఇద్దరు క్రీడాకారులకు సంయుక్తంగా రాజీవ్ ఖేల్ రత్న, 25 మందికి అర్జున అవార్డులు దక్కాయి. ఖేల్ రత్న లభించిన వారికి మెడల్‌తోపాటు రూ.7.5 లక్షలు, అర్జున అవార్డు కింద మొమెంటో రూ. 5 లక్షల నగదు బహూకరిస్తారు.

రాజీవ్ ఖేల్త్న్ర:
విజయ్ కుమార్ (షూటింగ్), యోగేశ్వర్ దత్(రెజ్లింగ్). వీరిద్దరూ ఇటీవల ముగిసిన లండన్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించారు.

అర్జున అవార్డులు: 
దీపిక, బొంబేలా దేవి (ఆర్చరీ), సుధా సింగ్, కవితా రౌత్ (అథ్లెటిక్స్), అశ్విని పొన్నప్ప, పారుపల్లి కశ్యప్ (బ్యాడ్మింటన్), ఆదిత్య మెహతా (బిలియర్డ్స్), వికాస్ కృషన్ (బాక్సింగ్), యువరాజ్ సింగ్ (క్రికెట్), సర్దార్ సింగ్ (హాకీ), యష్‌పాల్ సోలంకీ (జూడో), అనూప్ కుమార్ (కబడ్డీ), సమీర్ సుహాగ్ (పోలో), అన్నురాజ్ సింగ్, ఓంకార్ సింగ్, జైదీప్ కర్మాకర్ (షూటింగ్), దీపికా పల్లికల్ (స్క్వాష్), సందీప్ సెజ్వాల్ (స్విమ్మింగ్), సోనియా చాను (వెయిట్‌లిఫ్టింగ్), నర్సింగ్ యాదవ్, రాజిందర్ కుమార్, గీతా పోగట్ (రెజ్లింగ్), బిమల్‌జిత్ సింగ్ (వుషు), దీపా మల్లిక్ (అథ్లెటిక్స్-పారాలింపిక్స్), రామ్‌కరణ్ సింగ్ (అథ్లెటిక్స్-పారాలింపిక్స్).

ఫెదరర్‌కు సిన్సినాటి టైటిల్
ఏటీపీ సిన్సినాటి మాస్టర్‌‌స టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)గెలుచుకున్నాడు. ఆగస్ట్ 20న సిన్సినాటి (అమెరికా)లో జరిగిన ఫైనల్లో నొవోక్ జకోవిచ్‌ను ఓడించాడు. తద్వారా ఓపెన్ శకంలో ఐదుసార్లు సిన్సినాటి మాస్టర్స్ టైటిల్‌ను నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా అత్యధికంగా 21 మాస్టర్స్ టైటిల్స్‌తో రాఫెల్ నాదల్ పేరిట ఉన్న రికార్డును ఫెదరర్ సమం చేశాడు. మహిళా సింగిల్స్ టైటిల్‌ను చైనాకు చెందిన లీనా గెలుచుకుంది. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన మహేష్ భూపతి, రోహన్ బోపన్నలను ఓడించి రాబర్‌‌ట లిండ్ స్టెడ్ (స్వీడన్), హోరియా టెకాపు (రొమేనియా) టైటిల్ సాధించారు.

టెస్టుల్లో నెంబర్ వన్ దక్షిణాఫ్రికా
ఇంగ్లండ్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను గెలుచుకోవడం ద్వారా.. దక్షిణాఫ్రికా జట్టు టెస్టుల్లో ప్రపంచ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుచుంది. గతేడాది భారత్ నుంచి టాప్ ర్యాంకును ఇంగ్లండ్ సాధించింది.

దీపిక పల్లికల్ రికార్డు
భారత క్రీడాకారిణి దీపిక పల్లికల్ ఆస్ట్రేలియా స్క్వాష్ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్‌కు ప్రవేశించింది. తద్వారా ఈ టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరుకున్న తొలి భారత క్రీడాకారిణిగా పల్లికల్ రికార్డు సృష్టించింది. సెమీఫైనల్స్‌లో ఇంగ్లండ్‌కు చెందిన తారా మస్సార్ చేతిలో ఓడిపోయింది.
 
రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్‌కు రజతం
లండన్ ఒలింపిక్స్‌లో భారత్ రెజ్లర్ సుశీల్ కుమార్ 66 కేజీల ఫ్రీ స్టయిల్ విభాగంలో రజత పతకం సాధించాడు. దీంతో వరసగా రెండు ఒలింపిక్స్‌ల్లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందాడు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. సుశీల్ కుమార్ స్వస్థలం ఢిల్లీ.

యోగేశ్వర్‌కు కాంస్యం
భారత్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించాడు. పురుషుల రెజ్లింగ్ 60 కిలోల ఫ్రీస్టయిల్ విభాగంలో ఉత్తర కొరియాకు చెందిన జోంగ్ మయాంగ్‌పై విజయంతో యోగేశ్వర్ ను కాంస్య పతకం వరించింది. క్వాలిఫయింగ్ నుంచి రెప్‌చేజ్ వరకు యోగేశ్వర్ తన హవా కొనసాగించాడు. ప్రీ క్వార్టర్స్‌లో ఓడినా... కీలకమైన రెప్‌చేజ్‌లో మూడుబౌట్లు గెలిచి భారత్‌కు ఐదో పతకాన్ని అందించాడు. హర్యానాకు చెందిన యోగేశ్వర్ ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఇది మూడోసారి.

100, 200 మీటర్ల రేసులో బోల్ట్ రికార్డ్ 
100 మీటర్ల స్ప్రింట్ రేసులో ఉసేన్ బోల్ట్ (జమైకా) 9.63 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకున్నాడు. లండన్ ఒలింపిక్స్‌లో ఆగస్టు 6న జరిగిన ఈ రేసులో బోల్ట్ రికార్డ్ సృష్టించాడు. బీజింగ్ ఒలింపిక్స్ 100 మీటర్ల రేసును 9.69 సెకెన్లలో పూర్తిచేసి నెలకొల్పిన రికార్డును బోల్ట్ లండన్‌లో అదిగమించాడు. బోల్ట్‌కు స్వర్ణపతకం దక్కగా మరో జమైకన్ మొహాన్ బ్లేక్ 9.75 సెకన్లలో లక్ష్యాన్ని అధిగమించి రెండోస్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. ఆగస్టు 9న జరిగిన 200 మీ. పరుగులో, ఉసేన్ 4 ఁ 100 మీటర్ల రిలే పరుగులోను స్వర్ణ పతకాలు సాధించాడు. మూడు స్వర్ణాలు గెలిచిన తొలి స్ప్రింటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

మేరీ కోమ్‌కు కాంస్య పతకం
భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఆగస్టు 8న 51 కిలోల ప్లయ్ వెయిట్ సెమీ ఫైనల్స్‌లో బ్రిటన్ బాక్సర్ నికోలో ఆడమ్స్ చేతిలో మేరీకోమ్ ఓడిపోయింది. దీంతో ఆమెకు కాంస్యం దక్కింది. ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ ప్రవేశ పెట్టిన తొలిసారే భారత్‌కు కాంస్య పతకం సాధించి పెట్టింది. 
అమెరికాకు ఫుట్ బాల్‌లో స్వర్ణం:ఒలింపిక్ ఫుట్‌బాల్ స్వర్ణ పతకాన్ని అమెరికా గెలుచుకుంది. ఫైనల్స్‌లో జపాన్‌ను ఓడించింది.
హాకీలో జర్మనీకి స్వర్ణం: హాకీలో జర్మనీకి స్వర్ణం. 
అమెరికాకు మహిళ బాస్కెట్ బాల్: మహిళ బాస్కెట్‌బాల్ టైటిల్‌ను అమెరికా గెలుచుకుంది. ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అమెరికా స్వర్ణం సాధించింది.
నార్వేకి మహిళ హ్యాండ్‌బాల్: మహిళ హ్యాండ్‌బాల్‌లో నార్వే స్వర్ణం సాధించింది. మాంటెనెగ్రోను నార్వే ఓడించింది. పురుషుల హ్యాండ్‌బాల్‌లో స్వీడన్‌ను ఓడించి ఫ్రాన్స్ స్వర్ణం సాదించింది. 
మహిళ వాలీబాల్‌లో బ్రెజిల్‌కు స్వర్ణం: మహిళ వాలీబాల్‌లో బ్రెజిల్ స్వర్ణం సాధించింది. ఫైనల్‌లో బ్రెజిల్ అమెరికాను ఓడించింది. పురుషుల వాలీబాల్ టైటిల్‌ను రష్యా గెలుచుకుంది. ఫైనల్లో బ్రిటన్‌ను ఓడించి రష్యా విజయం సాధించింది.

లండన్ ఒలింపిక్స్‌లో అగ్రస్థానంలో అమెరికా
ఆగస్టు 12న ముగిసిన లండన్ ఒలింపిక్స్‌లో 46 స్వర్ణపతకాలతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. రజత, కాంస్య పతకాలతో కలిపి మొత్తం 104 పతకాలు అమెరికా సాధించింది. 38 స్వర్ణాలతో చైనా, 29 స్వర్ణాలతో బ్రిటన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 6 పతకాలు సాధించి 55వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌లో భారత్ అత్యధికంగా 6 పతకాలు సాధించడం ఇదే తొలిసారి. మొత్తం 204 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొనగా 85 దేశాలు మాత్రమే పతకాలు సాధించాయి. భారత్ 55వ స్థానంలో నిలిచింది.

పతకాలు సాధించిన భారత్ విజేతలు
విజయకుమార్ - షూటింగ్ - రజతం
సుశీల్ కుమార్ - రెజ్లింగ్ - రజతం
సైనా నెహ్వాల్ - బ్యాడ్మింటన్ - కాంస్యం
గగన్ నారంగ్ - షూటింగ్ - కాంస్యం
మేరీ కోమ్ - బాక్సింగ్ - కాంస్యం
యోగేశ్వర్ దత్ - రెజ్లింగ్ - కాంస్యం

పతకాల పట్టికలో మొదటి పది దేశాలు
జట్టు స్వ ర కాం మొ
అమెరికా 46 29 29 104
చైనా 38 27 22 87
బ్రిటన్ 29 17 19 65
రష్యా 24 25 33 82 
ద.కొరియా 13 8 7 28
జర్మనీ 11 19 14 44
ఫ్రాన్స్ 11 11 12 34
ఇటలీ 8 9 11 28
హంగేరి 8 4 5 17
ఆస్ట్రేలియా 7 16 12 35
 
విజయ్ కుమార్‌కు రజతం
షూటర్ విజయ్ కుమార్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని అందించాడు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన విజయ్‌కుమార్ ఆగస్టు 3న పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో రజత పతకం గెలిచాడు. క్వాలిఫైయింగ్‌లో 600కుగాను 585 పాయింట్లు సాధించి ఒలింపిక్స్ రికార్డును అధిగమించిన విజయ్ ఫైనల్‌లో 40కు 30 పాయింట్లు స్కోర్‌చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఒకే క్రీడా విభాగంలో రెండు పతకాలు రావడం ఇదే తొలిసారి కాగా షూటింగ్‌లో రజతం రావడం రెండోసారి. భారత ఆర్మీలో సుబేదార్‌గా పనిచేస్తున్న విజయ్ 2010 కామన్‌వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఒక రజతాన్ని కైవసం చేసుకున్నాడు.

ముర్రేకు పురుషుల సింగిల్స్ టైటిల్
ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే గెలుచుకున్నాడు. ఆగస్టు 5న ఫైనల్స్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెదరర్‌పై ముర్రే విజయం సాధించాడు.
మహిళల డబుల్స్: ఈ టైటిల్‌ను అమెరికాకు చెందిన వీన స్ విలియమ్స్, సెరెనా విలియమ్స్‌లు గెలుచుకున్నారు.

మహిళల సింగిల్స్: సెరెనా విలియమ్స్ స్వర్ణపతకం సాధించింది.
పురుషుల డబుల్స్: అమెరికాకు చెందిన మైక్ బ్రియాన్, బాబ్ బ్రియాన్‌లు స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.

సైనాకు కాంస్యం
ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్ ్సలో భారత్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు కాంస్యం లభించింది. మూడో స్థానానికి ఆగస్టు 4న జరిగిన పోటీలో ప్రత్యర్థి చైనా క్రీడాకారిణి, ప్రపంచ రెండో ర్యాంకర్ జిన్‌వాంగ్ గాయంతో పోటీ నుంచి విరమించుకోవడంతో సైనాకు కాంస్యం దక్కింది. భారత్‌కు ఇది మూడో పతకం.

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిన క్రీడాకారిణిగా సైనా ఘనత సాధించింది. సెమీస్‌లో ప్రపంచ నెంబర్‌వ న్ యిహాన్ వాంగ్ చేతిలో ఓడిన సైనా కాంస్యం కోసం కూడా తనకన్నా మెరుగైన ర్యాంకర్‌తోనే ఆడింది. బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరిన మొదటి మహిళ, భారత్‌కు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన రెండో మహిళగా సైనా రికార్డు సృష్టించింది. 
పురుషుల సింగిల్స్: లిన్ డాన్ (చైనా) పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం గెలుచుకున్నాడు. మలేషియాకు చెందిన లీ చాంగ్‌పై లిన్ డాన్ విజయం సాధించాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో కూడా లిన్ డాన్ స్వర్ణం సాధించాడు.

పురుషుల డబుల్స్: చైనాకు చెందిన కాయ్‌యున్, ఫు హాయ్ ఫింగ్‌లు డెన్మార్క్‌కు చెందిన మథియస్ బో, కర్‌స్టన్ ముంగిన్సన్‌లను ఓడించి స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
మహిళల సింగిల్స్: చైనాకు చెందిన లీ జురుయ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. యిహాన్ వాంగ్ పై లీ జురయ్ విజయం సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో పోటీ పడిన ఇద్దరు ఒకే దేశానికి చెందినవారు.

మహిళల డబుల్స్: టియాన్ క్వింగ్ , జావోయిలు స్వర్ణాన్ని గెలుచుకున్నారు. జపాన్‌కు చెందిన మిజుకి ఫుజి, రీకా కాకివాలపై వీరు విజయం సాధించారు.

వన్డే సిరీస్ విజేత భారత్
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంకలో ఆగస్టు 4న జరిగిన చివరి, ఐదో వన్డేను భారత్ గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఇర్ఫాన్ పఠాన్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యారు.

Thanking You,

¨`·.·´¨) Always
`·.¸(¨`·.·´¨) Keep
(¨`·.·´¨)¸.·´ Smiling!
  `·.¸.·´  
 
with regards,

నాగు........
(¯`v´¯)
.`.¸.´
¸.´.´¨) ¸.¨)
(¸.´(¸.´ (¸.¨¯`* ♥..........నాగు.............

     ®NAGU®
+91 8809995921
+91 9472716840



No comments:

Post a Comment